తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీ సర్కారుకు 'సుప్రీం' రూ.15,000 జరిమానా - the Supreme Court Advocates-on-Record Welfare Fund

కోర్టు సమయాన్ని వృథా చేసిందన్న కారణంతో.. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వానికి రూ.15,000 జరిమానా విధించింది సుప్రీం కోర్టు. ఓ కేసు విషయంలో అప్పీలును దాఖలు చేయడంలో 500లకు పైగా రోజులు జాప్యం చేసినందుకు గాను ఈ తీర్పు చెప్పింది.

SC imposes cost of Rs 15,000 on UP govt for wastage of judicial time
సుప్రీం కోర్టులో యూపీ సర్కారుకు రూ.15.000 జరిమానా

By

Published : Dec 13, 2020, 10:58 PM IST

న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేసినందుకుగాను ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు రూ.15,000 జరిమానా విధించింది. ఓ కేసులో 500లకు పైగా రోజుల ఆలస్యం తర్వాత అప్పీలు దాఖలు చేసినందుకు గాను ఈ రుసుం చెల్లించాలని ఆదేశించింది.

కేసు విషయంలో ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని జస్టిస్​ ఎస్​కే కౌల్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.

"స్పెషల్​ లీవ్​ పిటిషన్​ దాఖలు చేయడానికి 576 రోజుల సమయం తీసుకున్నారు. బాధ్యతారాహిత్యంగా అధికారులు వ్యవహరించారు. మేము ఈ పిటిషన్​ను తిరస్కరిస్తున్నాం. కానీ, కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు ​రూ.15,000 జరిమానాను పిటిషనర్ చెల్లించాలి. ఈ ఆలస్యానికి కారణమైన వారికి.. బాధ్యతను, సమయం విలువను గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ డబ్బులు చెల్లించాలని ఆదేశిస్తున్నాం."

-- సుప్రీం కోర్టు, ధర్మాసనం.

ఓ వ్యక్తి ఉద్యోగాన్ని క్రమబద్దీకరించాలని సూచిస్తూ.. 2018లో అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిని సవాల్​ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును సుప్రీం కోర్టు తాజాగా విచారించింది. అయితే.. అప్పీలును ఆలస్యం చేసినందుకు సంబంధిత అధికారులకు ఈ జరిమానా విధించింది.

ఇదీ చూడండి:సిక్కుల కోసం తీసుకున్న నిర్ణయాలపై 2 కోట్ల మెయిళ్లు

ABOUT THE AUTHOR

...view details