తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంలో నలుగురు నూతన న్యాయమూర్తుల నియామకం

సర్వోన్నత న్యాయస్థానంలో నలుగురు జడ్జిలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది న్యాయశాఖ. సుప్రీం న్యాయమూర్తుల చట్టానికి తాజా సవరణ చేసిన అనంతరం... గత నెలలో కొలీజీయం చేసిన సిఫార్సుల మేరకు ఈ దిశగా అడుగులు వేసింది. ఈ మేరకు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా న్యాయమూర్తులను నియమిస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీం చరిత్రలో 34 మంది న్యాయమూర్తులతో నూతన రికార్డు నమోదయ్యింది.

సుప్రీంలో నలుగురు నూతన న్యాయమూర్తుల నియామకం

By

Published : Sep 18, 2019, 11:39 PM IST

Updated : Oct 1, 2019, 3:41 AM IST

సుప్రీంకోర్టులో నలుగురు నూతన న్యాయమూర్తులు నియమితులయ్యారు. గత నెలలో కొలీజీయం చేసిన సిఫార్సుల మేరకు న్యాయమూర్తులు కృష్ణ మురారీ, ఎస్​ఆర్ భట్, వి. రామసుబ్రమణియన్, హృషికేశ్ రాయ్​లను సుప్రీం జడ్జిలుగా నియమిస్తూ న్యాయశాఖ బుధవారం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యాయమూర్తుల సంఖ్యను 31 నుంచి 34కు పెంచుతూ ఇటీవలే సవరణ చట్టం రూపొందించిన అనంతరం.. ఖాళీలను భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఈ నియామకం ద్వారా 34మంది న్యాయమూర్తులతో సుప్రీం చరిత్రలో నూతన రికార్డు నమోదయ్యింది.

పెద్దసంఖ్యలో పేరుకుపోయిన కేసుల నేపథ్యంలో సీజేఐను మినహాయించి 30గా ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను 34 కు పెంచుతూ కేంద్రం ఇటీవల చట్టం చేసింది.
1956 నాటి సుప్రీం న్యాయమూర్తుల చట్టంలో ఉన్న జడ్జిల సంఖ్య సీజేఐను మినహాయించి కేవలం 10 మాత్రమే. అనంతరం 1960 లో 13, 1977లో 17కు ఈ సంఖ్యను పెంచారు. 1979లో ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి 15మందికి కుదించారు.

మళ్లీ 1986లో జడ్జిల సంఖ్యను 25కు.. 2009లో జరిగిన చట్ట సవరణలో 30కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి: 'మోదీతో సమావేశం భేష్-బంగాల్ పేరుమార్పుపై చర్చ'

Last Updated : Oct 1, 2019, 3:41 AM IST

ABOUT THE AUTHOR

...view details