తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​ఆర్​సీ తుది జాబితా ఖరారు గడువు పెంపు

అసోం జాతీయ పౌరసత్వ నమోదు తుది జాబితా గడువును మరో నెల పొడగించింది సుప్రీంకోర్టు. జులై 31లోపు తుది జాబితాను ప్రకటించాల్సిందేనని స్పష్టంచేసింది. అయితే... 20 శాతం నమూనా పునఃపరిశీలన అనుమతి కోసం కేంద్రం, అసోం చేసిన అభ్యర్థనలను తిరస్కరించింది.

By

Published : Jul 23, 2019, 5:00 PM IST

Updated : Jul 23, 2019, 10:07 PM IST

అసోం జాతీయ పౌరసత్వ నమోదు

ఎన్​ఆర్​సీ తుది జాబితా ఖరారు గడువు పెంపు

అసోం జాతీయ పౌర రిజిస్టర్​(ఎన్​ఆర్​సీ)​ తుది జాబితాపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. తుది జాబితా విడుదల చేసేందుకు గడువును మరో నెల పొడగించింది అత్యున్నత న్యాయస్థానం. అంతకుముందు 2019 జులై 31నే ఖరారు చేయాలని ఆదేశించిన ధర్మాసనం... తాజాగా 2019 ఆగస్టు 31 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎన్​ఆర్​సీలో మార్పులు, చేర్పులను గుర్తించేందుకు.. నమూనా పునఃపరిశీలన అనుమతి కోరాయి కేంద్ర ప్రభుత్వం,అసోం. 20శాతం నమూనా పునఃపరిశీలనల కోసం చేసిన అభ్యర్థనలను తిరస్కరించింది కోర్టు.

కేంద్రం తరఫున అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​, అసోం తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా తమ వాదనలు వినిపించారు.

హజేలా నివేదికలపై..

అసోం ఎన్​ఆర్​సీ సమన్వయకర్త ప్రతీక్​ హజేలా సమర్పించిన నివేదికలను పరిశీలించిన జస్టిస్​ రంజన్​ గొగొయి, జస్టిస్​ ఆర్​ఎఫ్​ నారీమన్​ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

2018, జులై 30న అసోం ముసాయిదా ఎన్​ఆర్​సీ జాబితాను ప్రచురించింది ప్రభుత్వం. రాష్ట్రంలో 3.29 కోట్ల మంది ఉండగా జాబితాలో 2.89 కోట్ల మంది పేర్లు మాత్రమే నమోదయ్యాయి. 40 లక్షల 70 వేల 707 మంది పేర్లు నమోదు కాలేదు. అందులో 37 లక్షల 59 వేల 630 మంది పేర్లు తిరస్కరణకు గురయ్యాయి. 2 లక్షల 48 వేల 077 మంది పేర్లు పెండింగ్​లో ఉన్నాయి.

Last Updated : Jul 23, 2019, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details