సార్వత్రిక ఎన్నికల ఫలితం కోసం వీవీప్యాట్ రసీదులను 100శాతం లెక్కించి... ఈవీఎంలలో వచ్చిన ఓట్ల సంఖ్యతో సరిపోల్చాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చెన్నైకి చెందిన 'టెక్ ఫర్ ఆల్' సంస్థ ప్రతినిధులు ఈ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించేందుకు నిరాకరించింది జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.
మళ్లీ ఎందుకు...?
వీవీప్యాట్ల రసీదుల లెక్కింపు పిటిషన్లను ఇదివరకే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి, తీర్పునిచ్చిందని గుర్తు చేసింది సుప్రీంకోర్టు. మళ్లీ వ్యాజ్యాన్ని ఎందుకు దాఖలు చేశారని పిటిషనర్లను ప్రశ్నించింది.
" ప్రధాన న్యాయమూర్తి తీర్పును మేం మార్చలేం. ఇది నాన్సెన్స్. పిటిషన్ను తిరస్కరిస్తున్నాం."
-- జస్టిస్ అరుణ్ మిశ్రా