తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పీఓకే, గిల్గిత్​పై వ్యాజ్యం- పిటిషనర్​కు జరిమానా - గిల్గిత్

జమ్ముకశ్మీర్​లోని పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​, గిల్గిత్​ ప్రాంతాలను లోక్​సభ స్థానాలుగా గుర్తించాలని దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. పిటిషనర్​కు రూ.50 వేలు జరిమానా విధించింది.

పీఓకే, గిల్గిత్​పై వ్యాజ్యం- పిటిషనర్​కు జరిమానా

By

Published : Jul 1, 2019, 12:13 PM IST

పాక్​ ఆక్రమిత కశ్మీర్​, గిల్గిత్​ ప్రాంతాలను లోక్​సభ స్థానాలుగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.

నిఘా విభాగం 'రా' మాజీ అధికారి రామ్​ కుమార్​ యాదవ్​ వేసిన వ్యాజ్యాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఈ పిటిషన్​ చట్టబద్ధంగా ఆమోదయోగ్యం కాదంటూ కొట్టివేసింది. పిటిషనర్​కు రూ.50వేలు జరిమానా విధించింది.

ఇదీ చూడండి: అమర్​నాథుని దర్శనానికై కదిలిన భక్తజనం

ABOUT THE AUTHOR

...view details