తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పోక్సో'కేసుల కోసం ప్రత్యేక కోర్టులు పెట్టండి'

పోక్సో చట్టం కింద 100 లేదా అంతకు మించి కేసులు నమోదైన ప్రతిజిల్లాలోనూ 60 రోజుల్లోగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. తమ ఆదేశాలపై 30 రోజుల్లోగా నివేదిక అందించాలని సొలిసిటర్ జనరల్​కు సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్​ 26కు వాయిదా వేసింది.

'పోక్సో'కేసుల కోసం ప్రత్యేక కోర్టులు పెట్టండి'

By

Published : Jul 25, 2019, 2:42 PM IST

చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాల మీద వచ్చిన పత్రికా కథనాలను సుమోటోగా తీసుకుని విచారిస్తున్న సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది.

'లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ' (పోక్సో) చట్టం కింద 100 లేదా అంతకు మించి కేసులు నమోదైన ప్రతిజిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్​ 26కు వాయిదా వేసింది.

60 రోజుల్లో ఏర్పాటు చేయండి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్​, జస్టిస్ దీపక్​ గుప్త, జస్టిస్ అనిరుద్ధ బోస్​ల త్రిసభ్య ధర్మాసనం... 60 రోజుల్లోగా ఈ ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆయా కోర్టుల్లో శిక్షణ పొందిన, అనుభవజ్ఞులైన న్యాయవాదులను, సిబ్బందిని నియమించాలని సూచించింది.

30 రోజుల్లో నివేదిక ఇవ్వండి

చిన్నారులపై లైంగిక నేరాల కేసుల్లో ఫోరెన్సిక్ నివేదికలు సకాలంలో సమర్పించేలా చూడాలని... సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. తమ ఆదేశాలపై 30 రోజుల్లోగా నివేదిక అందించాలని సొలిసిటర్​ జనరల్​ను కోరింది. అలాగే ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు, న్యాయవాదులు, సిబ్బంది నియామకాలకు సరిపడా నిధులు కేటాయించి, సిద్ధంగా ఉంచాలని కేంద్రానికి సూచించింది.

ఆలస్యమవుతుంది

దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాల సమాచార సేకరణను మరోసారి చేపడితే... పోక్సో చట్టం అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

జిల్లాకో ఫోరెన్సిక్​ ల్యాబ్​

పోక్సో కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రతి జిల్లాలోనూ ఫోరెన్సిక్ ల్యాబ్​ ఏర్పాటుచేయాలని అమికస్ క్యూరీ వి. గిరి సూచించారు. వీటి ఏర్పాటుకు మరింత సమయం పట్టొచ్చని సుప్రీం అభిప్రాయపడింది. ఈలోగా, 'పోక్సో' కేసుల్లో విచారణను త్వరగా ముగించడానికి అవసరమైన నివేదికలు సకాలంలో సమర్పించేలా రాష్ట్రప్రభుత్వాలు కృషిచేయాలని సూచించింది.

ఇదీ చూడండి:- ఆమ్రపాలి సొమ్ము ధోని అనుబంధ సంస్థ ఖాతాలోకి!

ABOUT THE AUTHOR

...view details