తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టిక్​టాక్​ నిషేధంపై 24న తేల్చేయండి : సుప్రీం

టిక్​టాక్​పై నిషేధం ఎత్తివేయాలన్న వ్యాజ్యంపై ఈ నెల 24న విచారణ పూర్తి చేయలని మద్రాస్​ హైకోర్టును ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆ రోజు నిర్ణయం తీసుకోకపోతే నిషేధం తొలిగిపోతుందని స్పష్టం చేసింది.

టిక్​టాక్​ నిషేధంపై 24న తేల్చేయండి : సుప్రీం

By

Published : Apr 22, 2019, 1:34 PM IST

టిక్​టాక్​ నిషేధంపై 24న తేల్చేయండి : సుప్రీం
వీడియో షేరింగ్​ మొబైల్​ యాప్ టిక్​టాక్​పై నిషేధం ఎత్తివేయాలన్న వ్యాజ్యంపై మద్రాస్​ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 24న విచారణలోనే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం టిక్​టాక్ నిషేధాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన ​ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. వ్యాజ్యంపై మద్రాస్​ హైకోర్టు నిర్ణయం తీసుకోవటంలో విఫలమైతే అప్పటి నుంచి నిషేధం తొలిగిపోతుందని స్పష్టం చేసింది.

టిక్​టాక్​ యాప్​ను నిషేధించాలన్న మద్రాస్​ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ఇటీవలే నిరాకరించింది సుప్రీం కోర్టు.

ఇదీ చూడండీ:ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్​ కార్యకర్తల ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details