తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ, షాపై ఎందుకు చర్యలు తీసుకోరు?'

నరేంద్ర మోదీ, అమిత్​ షాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు కాంగ్రెస్​ ఎంపీ సుశ్మితా దేవ్​. వారిద్దరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తున్నా.. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు దేవ్​.

By

Published : Apr 29, 2019, 11:47 AM IST

Updated : Apr 29, 2019, 3:12 PM IST

మోదీ, అమిత్​షాపై సుప్రీంలో పిటిషన్​

మోదీ, షాలపై పిటిషన్​

కాంగ్రెస్​ ఎంపీ సుశ్మితా దేవ్​ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ఎన్నికల ప్రచారాల్లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దేవ్​ పిటిషన్​ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. రేపు వాదనలు విననున్నట్లు తెలిపింది. సుశ్మితా దేవ్​ తరఫున సీనియర్​ న్యాయవాది, కాంగ్రెస్​ నేత అభిషేక్​ మను సింఘ్వీ వాదించనున్నారు.

మోదీ, షాపై ఫిర్యాదు చేసినా.. ఈసీ సరిగా స్పందించట్లేదని పిటిషనర్​ తరఫున న్యాయవాది పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

బంగాల్​ అసాన్​సోల్​లో పోలింగ్​ హింసాత్మకం

Last Updated : Apr 29, 2019, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details