తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' హింసపై సిట్​ దర్యాప్తు- త్వరలో సుప్రీం నిర్ణయం! - We will take care of the violence

పౌర చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు హింసాత్మకం కావడంపై సీబీఐ లేదా న్యాయస్థానం పర్యవేక్షణలో సిట్​ దర్యాప్తు జరిపించాలని దాఖలైన పిటిషన్​ను పరిశీలిస్తామని తెలిపింది సుప్రీం కోర్టు. ఈ అంశంలో తాము జోక్యం చేసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

sc-agrees-to-consider-plea-for-probe-into-violence-during-protests-against-citizenship-amendment-act
'పౌర' హింసపై సిట్​ దర్యాప్తు- త్వరలో సుప్రీం నిర్ణయం!

By

Published : Dec 17, 2019, 12:26 PM IST

Updated : Dec 17, 2019, 2:45 PM IST

'పౌర' హింసపై సిట్​ దర్యాప్తు- త్వరలో సుప్రీం నిర్ణయం!

పౌర చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోన్న అల్లర్లపై దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ఈ ఆందోళనలపై సీబీఐ లేదా న్యాయస్థానం పర్యవేక్షణలో సిట్​ దర్యాప్తు జరిపించాలని దాఖలు చేసిన పిటిషన్​ను విచారణకు స్వీకరిస్తామని ధర్మాసనం పేర్కొంది.

ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్​ కోరగా న్యాయస్థానం తోసిపుచ్చింది. అలా అని ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవడం లేదని స్పష్టంచేసింది.

ఎవరున్నారో తెలియాలి..?

పౌరచట్టానికి వ్యతిరేకంగా బంగాల్​లో జరిగిన ఆందోళనలను ప్రస్తావించారు పిటిషనర్. రైళ్లకు నిప్పుపెట్టారని, దీని వెనుక ఎవరున్నారో సీబీఐ లేదా సిట్​ దర్యాప్తు జరిపించాలని ఉపాధ్యాయ్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

దిల్లీ జామియా, అలీగఢ్​లోని ముస్లిం విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు, పోలీసుల చర్యలపై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. అనంతరం.. ఉపాధ్యాయ పిటిషన్​పై వాదనలు వినే అవకాశముంది.

ఇదీ చూడండి:బంగాల్​లో 'పౌర' ఆందోళనలు తీవ్రం.. ఈశాన్యాన తగ్గుముఖం

Last Updated : Dec 17, 2019, 2:45 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details