తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నల్లధన చట్టంపై దిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే - కేంద్రం

నల్లధన నిరోధక చట్టం-2016 అమలుపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. 2015 జులై నుంచి నిందితులపై ఈ చట్టాన్ని అమలు చేసేలా కేంద్రం తీసుకొచ్చిన నోటిఫికేషన్​పై దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది అత్యున్నత న్యాయస్థానం.

నల్లధన చట్టంపై దిల్లీ హైకోర్టు తీర్పునకు సుప్రీం బ్రేక్

By

Published : May 21, 2019, 1:30 PM IST

నల్లధన చట్టంపై దిల్లీ హైకోర్టు తీర్పునకు సుప్రీం బ్రేక్

నల్లధన నిరోధక చట్టం- 2016 అమలులో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్​ను నేడు విచారించింది సుప్రీం న్యాయమూర్తి జస్టిస్​ ఇందిరా బెనర్జీ, జస్టిస్​ సంజీవ్​ ఖన్నాల ధర్మాసనం. 2015 జులై నుంచే ఈ చట్టాన్ని అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించింది.

కేంద్రం అభ్యర్థన మేరకు అగస్టా వెస్ట్​ల్యాండ్​ వీవీఐపీ హెలికాప్టర్ల​ కుంభకోణంలో నిందితుడైన గౌతమ్​ ఖైతాన్​కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ​ఆరు వారాల్లో స్పందించాలని ఖైతాన్​ను ఆదేశించింది.

ఇదీ నేపథ్యం

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దిల్లీ హైకోర్టు గతంలో స్టే విధించింది. 2016లో తీసుకొచ్చిన నల్లధనం చట్టం, ఆదాయపన్ను చట్టాలు.. జులై, 2015 నుంచి అమలు చేసేందుకు వీలు లేదని స్పష్టం చేసింది.

గౌతమ్​ ఖైతాన్​పై ఆదాయపన్ను శాఖ ఎలాంటి చర్యలు చేపట్టకుండా దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఖైతాన్​పై ఎలాంటి చర్యలు చేపట్టరాదని మే 16న ఆదాయపన్ను శాఖను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. ఈ కేసుపై విచారణను జులైకి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: రాజీవ్​కు కాంగ్రెస్​ నేతల నివాళులు- మోదీ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details