తెలంగాణ

telangana

By

Published : May 17, 2019, 1:17 PM IST

ETV Bharat / bharat

శారద కుంభకోణం: రాజీవ్​కు మళ్లీ చిక్కులు

బంగాల్​ శారదా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్​కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్​కుమార్​కు అరెస్టు నుంచి కల్పించిన రక్షణను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. న్యాయపరమైన ఉపశమనం కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించేందుకు 7 రోజులు గడువు ఇచ్చింది.

శారద కుంభకోణంలో సుప్రీం కీలక నిర్ణయం

శారదా కుంభకోణం కేసులో కీలక నిర్ణయం తీసుకుంది సర్వోన్నత న్యాయస్థానం. కోల్​కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్​ కుమార్​ అరెస్ట్​పై ఉన్న రక్షణలను తొలగించింది. న్యాయపరమైన ఉపశమనం కోసం ఏడు రోజుల్లోగా సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

"మేం రాజీవ్​కుమార్ అరెస్టుపై ఫిబ్రవరి 5న జారీ చేసిన మధ్యంతర రక్షణలను ఎత్తివేస్తున్నాం. కోర్టు రక్షణ మరో ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. అరెస్టు నుంచి ఉపశమనానికై రాజీవ్ కుమార్ కోర్టును ఆశ్రయించవచ్చు. శారదా కుంభకోణం కేసులో సీబీఐ చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు."

-సుప్రీంకోర్టు తీర్పు

బంగాల్​లో రాజకీయంగా పెను దుమారం రేపిన శారదా కుంభకోణం కేసులో సాక్ష్యాలను రాజీవ్​ కుమార్​ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం.

ఇదీ చూడండి: భారత యూట్యూబ్​ యోధుడి అరుదైన ఘనత

ABOUT THE AUTHOR

...view details