తెలంగాణ

telangana

By

Published : Jul 31, 2020, 12:42 PM IST

ETV Bharat / bharat

సరయూ నది ఒడ్డున రఫేల్ సైకత శిల్పం

భారత అమ్ములపొదిలో చేరిన భీకర యుద్ధ విమానం రఫేల్​ కళాకృతిని రూపొందించారు ప్రసిద్ధ సైకతశిల్పి అశోక్​ కుమార్​. సరయూ నది ఒడ్డున సృష్టించిన ఈ శిల్పంపై 'రఫేల్​ భారత్​కు కాపలాదారు' అనే సందేశాన్ని ఇచ్చారు.

rafael on sand
రఫేల్ సైకత శిల్పం

బిహార్​ సారణ్​ జిల్లాకు చెందిన ప్రసిద్ధ సైకత శిల్పి అశోక్ కుమార్.. సరయూ నది ఒడ్డున రఫేల్ యుద్ధ విమానాల ఆకారాన్ని రూపొందించారు. 'రఫేల్​ భారతదేశానికి కాపలాదారు' అనే సందేశాన్ని దానిపై రాశారు అశోక్. రఫేల్​ రాకతో జాతీయ భద్రతలో 100 అడుగులు ముందుకు వేశామని అభిప్రాయపడ్డారు.

రఫేల్​ను తీర్చిదిద్దుతూ అశోక్​

అశోక్​ రూపొందించిన ఈ కళాకృతి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత భీకర యుద్ధ విమానం రఫేల్​ భారత వైమానిక దళంలో చేరడం దేశానికి గర్వకారణమని అశోక్ కుమార్ అన్నారు.

రఫేల్ సైకత శిల్పం

అశోక్​ కుమార్​ గతంలోనూ ఇలాంటి సందేశాత్మక సైకత శిల్పాలను రూపొందించారు. లాక్​డౌన్​లో చాలా మందికి సాయమందించిన బాలీవుడ్​ నటుడు సోనుసూద్​ కళాకృతిని కూడా ప్రదర్శించారు.

సోనూసూద్ కళాకృతితో అశోక్

ఇదీ చూడండి:భారత్​కు రఫేల్​- వాయుసేనకు కొత్త శక్తి

ABOUT THE AUTHOR

...view details