లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ప్రభుత్వానికే ఉందని స్పష్టం చేసింది కాంగ్రెస్. హోదా లేకపోయినా ప్రజల సమస్యలపై ఇతర విపక్షాలతో కలిసి పోరాడతామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఉద్ఘాటించారు.
"మాకు 54 మంది ఎంపీలు లేనిదే ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడగలేము. 10 శాతానికి 2 సీట్లు తక్కువగా ఉన్నాయి. ఈ కారణంగానే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండే అవకాశం లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదాపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలి. ఇది తప్పనిసరేమీ కాదు. ఇందులో డిమాండ్ ఏమీ లేదు.