ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు పంపేందుకు అభ్యర్థులను ఖరారు చేసింది భాజపా. యూపీ నుంచి 8 మంది అభ్యర్థులను ప్రకటించింది. అదేసమయంలో ఉత్తరాఖండ్ నుంచి బరిలోకి దిగే మరో అభ్యర్థి పేరును వెల్లడించింది.
యూపీలో ఖాళీ అయిన 10 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు ఈ నెల మొదట్లో ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూపీ అసెంబ్లీలో భాజపాకు 304 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకేనని తెలుస్తోంది. ఉత్తరాఖండ్ స్థానంలో కూడా భాజపా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ తొమ్మిది మంది ఎన్నికతో రాజ్యసభలో భాజపా సీట్ల సంఖ్య 90కి పెరగనుంది.