తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ నకిలీ కరెన్సీ విలువ రూ.87కోట్లు! - పుణె నకిలీ కరెన్సీ ఘటన

పుణెలో నకిలీ కరెన్సీ జప్తు చేసిన ఘటనలో నోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు రూ.87కోట్ల విలువైన భారత, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వివరించారు.

Rs 87 crore were seized in Pune
ఆ నకిలీ కరెన్సీ విలువ రూ.87కోట్లు!

By

Published : Jun 11, 2020, 12:47 PM IST

పూణె ఎరవాడా సంజయ్​ పార్క్​ వద్ద బుధవారం స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ విలువ రూ.87కోట్లు అని అధికారులు వెల్లడించారు. లెక్కింపు ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు.

"ఇప్పటివరకు 87కోట్లు విలువ చేసే భారత్​, అమెరికా కరెన్సీని జప్తు చేశాం. లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. నోట్ల నాణ్యతను పరిశీలిస్తున్నాం. అయితే చాలా నోట్లు 'చిల్డ్రన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా'కు చెందినవి అని, అవి డమ్మీ అని గుర్తించాం."

-- పోలీసు అధికారి.

ఇదీ జరిగింది...

నకిలీ కరెన్సీ

పుణె పోలీసుల యాంటీ ఎక్స్‌ట్రాక్షన్ సెల్, ఇండియన్ ఆర్మీకి చెందిన ఇన్వెస్టిగేషన్ సెల్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్​ నిర్వహించారు. పుణె విమానాశ్రయానికి సమీపంలోని ఓ బంగ్లాలో పెద్ద సంఖ్యలో నకిలీ నోట్లు ఉన్నట్లు తెలుసుకున్నారు. భారతీయ కరెన్సీకి బదులుగా విదేశీ కరెన్సీని తీసుకోవడానికి ఒక పోలీసు అధికారిని పంపారు. తద్వారా నకిలీ నోట్ల రాకెట్‌ను బయటపెట్టారు. బంగ్లా నుంచి కెమెరాలు, రెండు తుపాకులు, ఒక కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఒక ప్రింటింగ్ మెషిన్, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోట్లన్నీ బంగ్లాలో కట్టలు కట్టలుగా పేర్చి ఉన్నాయి.

ఈ ఆపరేషన్​లో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశారు. షేక్​ అలీమ్​ గులాబ్​ ఖాన్​, రితేశ్​ రత్నాకర్​, సునీల్​ సర్దా, తుపైల్​ అహ్మద్​ మహమ్మద్​ ఇషక్​ ఖాన్​, అబ్దుల్​ గని ఖాన్​, అబ్దుల్​ రెహ్మాన్​గా గుర్తించారు. వీరిలో అలీమ్​ గులాబ్​ ఖాన్​ ఇండియన్​ ఆర్మీకి చెందిన వాడని తేలింది. కొంత మంది వ్యక్తులతో కలిసి ఆర్మీ అధికారి నకిలీ నగదును డాలర్లుగా మారుస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు...

ABOUT THE AUTHOR

...view details