విమానాశ్రయాల్లో భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. అందుకే మాదక ద్రవ్యాలను విదేశాలకు సరఫరా చేసేందుకు వినూత్న దారులను వెతుకుతుంటారు కేటుగాళ్లు. తమ పని నెరవేర్చుకునేందుకు ఎంతటి మోసానికైనా తెగిస్తున్నారు. తాజాగా వివాహ శుభలేఖల్లో ఏకంగా రూ.5 కోట్లు విలువైన ఎఫిడ్రైన్ను సరఫరా చేస్తూ అధికారుల కంటపడ్డాడు ఓ వ్యక్తి.
పెండ్లి పత్రికల్లో రూ.5 కోట్లు విలువైన మాదక ద్రవ్యాలు! ఇదీ జరిగింది
మధురైకి చెందిన ఓ వ్యక్తి రూ.5 కోట్లు విలువైన 5.49 కిలోల ఎఫిడ్రైన్ను ఆస్ట్రేలియాకు తరలించేందుకు పూనుకున్నాడు. మాదక ద్రవ్యాలను కంగారూ దేశానికి చేర్చేందుకు పెండ్లి పత్రికనే వాహకంగా వినియోగించేందుకు సిద్ధమయ్యాడు.
పెండ్లి పత్రికల్లో రూ.5 కోట్లు విలువైన మాదక ద్రవ్యాలు! అనుకున్న విధంగానే మొత్తం ఎఫిడ్రైన్ను 86 చిన్న చిన్న పాలిథీన్ ప్యాకెట్లలో నింపాడు. ఎవరికీ అనుమానం రాకుండా శుభలేఖల మధ్యలో వీటిని అమర్చాడు.
పెండ్లి పత్రికల్లో రూ.5 కోట్లు విలువైన మాదక ద్రవ్యాలు! అలా మొత్తం 86 ప్యాకెట్లను కొన్ని వివాహ పత్రికల్లో అమర్చి.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే అక్కడ తనిఖీల్లో మాదక ద్రవ్యాలు బయటపడే సరికి ఆ కేటుగాడి తతంగమంతా బట్టబయలైంది. మొత్తం ఎఫిడ్రైన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పెండ్లి పత్రికల్లో రూ.5 కోట్లు విలువైన మాదక ద్రవ్యాలు!