తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామమందిర నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళం!

రామమందిర నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళం ప్రకటించింది బిహార్​లోని మహావీర్ ఆలయ పాలకమండలి. ఈ మొత్తంలో రూ.2 కోట్లను చెక్ రూపంలో అందజేయనున్నట్లు తెలిపింది.

ayodhya
రామమందిర నిర్మాణానికి రూ. 10 కోట్ల విరాళం!

By

Published : Feb 9, 2020, 10:03 AM IST

Updated : Feb 29, 2020, 5:31 PM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఉన్న న్యాయపరమైన అడ్డుంకులు తొలగిపోయిన నేపథ్యంలో త్వరలో కార్యక్రమాలు ప్రారంభిస్తామని ఇటీవల ప్రకటించింది కేంద్రం. ఈ నేపథ్యంలో మందిరనిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బిహార్ పట్నాలోని మహావీర్​ ఆలయ పాలకమండలి మందిర నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అందులో భాగంగా రూ. 2 కోట్ల చెక్కును అందజేయనున్నట్లు వెల్లడించింది.

"రామమందిర నిర్మాణానికి మహావీర్ ఆలయం తరఫున విరాళం అందజేయడానికి వెళ్తున్నాం."

-మహావీర్ మందిర్ ట్రస్ట్ నిర్వాహకులు

అయితే మందిర నిర్మాణానికి సంబంధించి తాము ఏర్పాటు చేసిన విరాళాల పెట్టెలో అణా పైస విలువైన 30 నాణేలను భక్తులు వేశారని వెల్లడించారు. వీటిపై సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడి చిత్రాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ పురాతన నాణేలను ఈస్ట్ ఇండియా కంపెనీవారు 1818లో ముద్రించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: గుర్తు పెట్టుకోండి.. గెలిచేది మేమే : భాజపా

Last Updated : Feb 29, 2020, 5:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details