పేదల ఆకలి తీర్చే 'రోటీ బ్యాంక్' నిరుపేదలకు అండగా నిలుస్తూ నిత్యం వందల మంది ఆకలి తీరుస్తున్నారు గుజరాత్ రాజ్‌కోట్‌లోని బోల్బాలా స్వచ్ఛంద సంస్థ సభ్యులు. ఆసుపత్రుల్లోని రోగులు, పట్టెడన్నం దొరకని నిరుపేదలకు ప్రతి రోజు కడుపునిండా ఆహారం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
రోటీ బ్యాంకు ఏర్పాటు చేసి ప్రతి రోజు నగరంలోని ఇంటింటికి తిరుగుతూ.. రొట్టెలను పోగు చేస్తున్నారు. వాటితో పాటు వారి సొంత ఖర్చుతోనూ భోజనం అందిస్తున్నారు.
"ఖాళీ కడుపుతో ఎవరూ పడుకోవవద్దనేది మా ఉద్దేశం. ఇలాంటివి బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో చెపడుతున్న వీడియోలు చూసిన అనంతరం ఈ ఆలోచన వచ్చింది. మా వాహనం ప్రతి రోజు 50 కిలోమీటర్ల మేర ఇంటింటికి తిరుగుతూ రొట్టెలు పోగుచేస్తుంది. ప్రతి రోజు సుమారు 3 వేల రొట్టెలు వరకు లభిస్తాయి. ఆహారం లేని నిరుపేదలు, ఆసుపత్రుల్లోని రోగులకు వీటిని అందిస్తాము. కడుపునిండా ఆహారం పెడతాం. ఇతర ప్రాంతాల్లో ఇలాంటి సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం."
- జే ఉపాధ్యాయ, బోల్బాలా స్వచ్ఛంద సంస్థ సభ్యుడు.
ఇదీ చూడండి: ఎగ్జిట్ పోల్స్ ఓటరు నాడి పట్టుకుంటున్నాయా?