తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాహాకూటమి సభలో రంకెలేసిన ఎద్దు! - AKHILESH

ఉత్తరప్రదేశ్​ కన్నౌజ్​లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్​డీ కూటమి నిర్వహించిన సభలో ఓ ఎద్దు కాసేపు బీభత్సం సృష్టించింది. దాన్ని నిలువరించే క్రమంలో ఓ యువకుడు గాయాలపాలయ్యాడు. బహుశా వృషభం ఫిర్యాదు చేసేందుకే వచ్చి ఉంటుందని వ్యాఖ్యానించారు యూపీ మాజీ సీఎం అఖిలేశ్​ యాదవ్.

మాహాకూటమి సభలో రంకెలేసిన ఎద్దు!

By

Published : Apr 26, 2019, 8:02 AM IST

ఉత్తరప్రదేశ్​లోని కన్నౌజ్​లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్​ఎల్​డీ పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఓ వృషభం గందరగోళం సృష్టించింది. దాన్ని నియంత్రించేందుకు అక్కడివారు ఆపసోపాలుపడ్డారు. ఈ ప్రయత్నంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులనూ కాసేపు ముప్పుతిప్పలు పెట్టింది ఆ ఎద్దు. కొంత మంది భయంతో పరుగులు తీశారు. చివరకు ఎలాగోలా దానిని అక్కడి నుంచి తరలించిన అనంతరం సభ యథావిధిగా కొనసాగింది.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​​ హెలికాప్టర్​లో ఇక్కడికి వచ్చి ఉంటారని భావించి.. బహుశా తన సమస్యల గురించి ఆయనకు ఫిర్యాదు చేసేందుకే ఎద్దు వచ్చి ఉంటుందని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్ చమత్కరించారు.

యూపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఎద్దు గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు అఖిలేశ్.​

"మేం అధికారంలో ఉన్నప్పుడు ఎక్స్​ప్రెస్​వేను 21 నెలల్లో పూర్తి చేశాం. కానీ రెండేళ్లుగా పశువుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక రాజకీయ కార్యక్రమానికి ఎద్దును రాకుండా నియంత్రించలేని ప్రభుత్వం ఇక రైతులు, పేదల సమస్యలు తీరుస్తుందా"
-అఖిలేశ్ యాదవ్​ ట్వీట్​

ఇదీ చూడండి: వారణాసిలో నేడు ప్రధాని మోదీ నామినేషన్​

ABOUT THE AUTHOR

...view details