తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ డిస్కౌంట్..!

ప్రత్యామ్నాయ రవాణా సాధనాల నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తోంది రైల్వేశాఖ. గతేడాది 50 శాతం కంటే తక్కువ ఆదాయం నమోదైన హైస్పీడ్​ రైళ్ల టికెట్ ధరలను 25 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.

ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ డిస్కౌంట్

By

Published : Aug 27, 2019, 10:32 PM IST

Updated : Sep 28, 2019, 12:55 PM IST

రోడ్డు ప్రయాణ సాధనాలు, తక్కువ ధరకు సేవలు అందిస్తున్న విమానయాన సంస్థల నుంచి పోటీని ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తోంది రైల్వేశాఖ. తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న శతాబ్ది, తేజస్​, గతిమాన్ వంటి హైస్పీడ్​ రైళ్ల టికెట్లను 25 శాతం తగ్గింపుతో అందించేందుకు యోచిస్తోందని రైల్వే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

ఏసీ ఛైర్​ కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్​ల సీట్ల ధరల ఆధారంగా ఈ డిస్కౌంట్​ను నిర్ణయించనుంది. టికెట్ ధరతో అదనంగా జీఎస్​టీ, రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్​ ఫాస్ట్​ సుంకం వీటికి అదనం.

"గతేడాది నెలవారీ ఆదాయం 50 శాతానికి తగ్గిన రైలు సర్వీసుల్లో ఈ టికెట్​ డిస్కౌంట్​ వర్తింపజేస్తాం."

-రైల్వే అధికారి

ఈ విధంగా ఆదాయం తగ్గిందని గుర్తించిన రైళ్లలో డిస్కౌంట్​ను ఆయా జోన్ల ప్రిన్సిపల్ కమర్షియల్ మేనేజర్లు నిర్ణయిస్తారని స్పష్టం చేసింది. డిస్కౌంట్​ను నిర్ణయించేటప్పుడు పోటీ రవాణా సాధనాల ధరను కూడా పరిగణనలోకి తీసుకుంటామని రైల్వే వర్గాలు వెల్లడించాయి.

వివిధ విభాగాలుగా...

ఏడాదికి ఒకసారి, ఆరు నెలలు, సీజన్, వారాంతాల్లో ఈ డిస్కౌంట్​ కల్పించవచ్చని పేర్కొన్నారు రైల్వే శాఖ ఉన్నతాధికారి. తాజా రాయితీ అందించే రైళ్లలో గ్రేడెడ్​ డిస్కౌంట్, ఫ్లెక్సీ-ఫేర్ వంటి పథకాలు వర్తించవని తెలిపారు. సెప్టెంబర్ 30లోగా తక్కువ ఆదాయం ఉన్న హైస్పీడ్ రైళ్లను గుర్తించి... ఈ విషయమై ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. ఆదాయాన్ని పెంచేందుకు ఆయా జోన్లు సమర్థంగా పనిచేయాల్సుంటుందన్నారు.

డిస్కౌంట్లు అమలు చేసిన నాలుగు నెలల అనంతరం... రైల్వే జోన్లు ఫలితాల నివేదికను అందించాలని కోరనున్నట్లు ఆ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి: మంటగలుస్తున్న మానవత్వం...!

Last Updated : Sep 28, 2019, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details