మహారాష్ట్ర ముంబయిలో స్థానికంగా నడుస్తున్న రైళ్ల సంఖ్యను పెంచనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సెంట్రల్ రైల్వే జోన్లో మరో 150, పశ్చిమ రైల్వే జోన్లో మరో 148 రైళ్లు పెంచనున్నారు. వీటితో ఒక్కో జోన్ నుంచి 350 రైళ్ల సేవలు అందించనున్నారు. ఈ రైళ్లు కేవలం పెద్ద స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని గోయల్ చెప్పారు.
వారికి మాత్రమే అనుమతి..
ఈ రైళ్లలో సాధారణ ప్రయాణికులకు అనుమతి లేదని, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నిత్యావసర సేవల సిబ్బంది, కేంద్ర, ఐటీ, జీఎస్టీ, కస్టమ్స్, పోస్టల్, జాతీయ బ్యాంకుల సిబ్బంది, ముంబయి పోర్టు ట్రస్టు, న్యాయ, రక్షణ, రాజ్ భవన్ ఉద్యోగులు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు గోయల్.
ఇదీ చూడండి:పాక్ కుట్ర భగ్నం- ముగ్గురు ఖలిస్థాన్ ఉగ్రవాదులు అరెస్టు