ఒడిశాలో తన భార్యను అత్యంత కిరాకతంగా చంపిన కేసులో ఓ విశ్రాంత ఆర్మీ వైద్యుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 2013లో జరిగిన ఈ హత్య కేసులో తాజాగా తీర్పును వెలువరించింది భువనేశ్వర్ జిల్లా కోర్టు.
78 ఏళ్ల సోమనాథ్ పరిదా సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వైద్యుడిగా పనిచేశాడు. తన భార్య ఉషా శ్రీని 2013లో చంపి.. ఆమె శరీరాన్ని 300 ముక్కలు చేశాడు. అనంతరం ఇంట్లోనే పెట్టెలో పెట్టాడు.