తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో సమాచార వ్యవస్థ పునరుద్ధరణ

కశ్మీర్​ లోయలో క్రమంగా పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు వీలుగా పలుచోట్ల ఆంక్షలను సడలించారు అధికారులు. 2జీ ఇంటర్నెట్​ సేవల పునరుద్ధరణతో పాటు శ్రీనగర్​లో సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.

By

Published : Aug 17, 2019, 3:32 PM IST

Updated : Sep 27, 2019, 7:21 AM IST

కశ్మీర్​ లోయలో సమాచార వ్యవస్థ పునరుద్ధరణ

జమ్ముకశ్మీర్​లో క్రమంగా పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో లోయలో పాక్షికంగా ఆంక్షలు సడలించారు. 2జీ ఇంటర్నెట్​ సేవలను పునరుద్ధరించారు. శ్రీనగర్​లోని చాలా ప్రాంతాల్లో సమాచార సేవలు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.

కశ్మీర్​లో భద్రతా బలగాల గస్తీ యథావిధిగా కొనసాగుతుండగా... జనసంచారంపై మాత్రమే ఆంక్షలు సడలించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

12 జిల్లాలు ప్రశాంతం

జమ్ముకశ్మీర్​లోని 12 జిల్లాల్లో చాలా వరకూ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, 5 జిల్లాల్లో మాత్రమే పరిమిత స్థాయిలో ఆంక్షలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. సివిల్​ లైన్స్, ఇతర జిల్లా కేంద్రాల్లో ప్రైవేటు వాహనాలు నడుస్తున్నాయి. కొన్ని దుకాణాలు ఉదయం తెరిచినా ప్రధాన వాణిజ్య సముదాయాలు, పెట్రోల్ బంకులు మూతపడే ఉన్నాయి.

మరింత ఉపశమనం

తాజా నిర్ణయంలో 35 పోలీస్​ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో ఆంక్షలను సడలించారు. రాష్ట్రంలో మొత్తం 96 టెలిఫోన్​ ఎక్స్ఛేంజీల్లో 17 పని చేస్తున్నాయి. మరో 20 ఎక్స్ఛేంజీలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని సమాచారం. శ్రీనగర్​లో సివిల్​ లైన్స్​, కంటోన్మెంట్​, విమానాశ్రయం, రాజ్​ బాఘ్​, జవహార్ నగర్​లో 50 వేల ల్యాండ్​ ఫోన్లు పని చేస్తున్నాయి.

ఇదీ చూడండి: భూటాన్​లో మోదీకి అడుగడుగునా బ్రహ్మరథం

Last Updated : Sep 27, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details