కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లు-2019కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఓటింగ్ సమయంలో సభలో 224 మంది సభ్యులు ఉండగా.. బిల్లుకు అనుకూలంగా 125 మంది, వ్యతిరేకంగా 99 మంది ఓటు వేశారు.
భారత్లోని పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల ముస్లిమేతరులకు దేశ పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లును తీసుకువచ్చింది కేంద్రం. బిల్లు ఆమోదంపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షా సహా సర్కారు హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ మాత్రం చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించింది. ఆమోదంపై ఎవరేమన్నారంటే..
'మరో మైలురాయి'
భారతదేశానికి ఇది ఒక మైలురాయి. దేశ సౌభ్రాతృత్వానికి ప్రతీక. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడం ఆనందంగా ఉంది. బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు. ఏళ్లుగా మతపీడనను ఎదుర్కొంటున్న వారికి ఈ బిల్లు ఉపశమనం. - ప్రధాని మోదీ ట్వీట్