తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2019, 6:12 AM IST

ETV Bharat / bharat

కాంగ్రెస్​ 'మెరుపు దాడిపై' దేశం మాటేంటి..?

సార్వత్రిక సమరంలో అతిపెద్ద హామీతో కాంగ్రెస్ ముందుకు దూకింది. మొదటి నుంచి చెబుతూ వస్తున్న కనీస ఆదాయ హామీపై స్పష్టతనిచ్చింది. పేద కుటుంబాలకు ఏటా రూ.72వేలు చెల్లిస్తామని ప్రజాకర్షక మంత్రం వేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. గెలుపే లక్ష్యంగా ప్రకటించిన న్యూన్తమ్​ ఆయోజన్​పై మిశ్రమ స్పందన వస్తోంది.

రాహుల్​ అస్త్రంపై ప్రజానాడి

రాహుల్​ అస్త్రంపై ప్రజానాడి
ఎన్నికల ముందు అతిపెద్ద నగదు బదిలీ పథకాన్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. ఎన్నికల ప్రధాన అస్త్రంగా న్యూన్తమ్​ ఆయోజన్​ను ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికే రైతులకు ఏటా ఆరు వేలు ప్రకటించి భాజపా ముందంజలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ప్రకటించిన రూ.72 వేల భృతిపై ప్రజలు ఏమంటున్నారో చూద్దాం.

"ప్రతిసారి ఇదే చెబుతారు. కొందరు రూ.15 లక్షలు ఇస్తామంటారు. కొందరు రూ.12 వేలు అంటారు. కానీ మాకేం రాదు. ఇక్కడ మాకు కుళాయి ఉన్నా నీరు రాదు. తాగునీటి కోసమే చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది."
- మహ్మద్ ఆరిఫ్, కాన్పూర్

"రాహుల్ ప్రధాని అయితే చెప్పింది కచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పినవన్నీ చేశారు. మోదీ మాత్రం అలా కాదు."
- ఖుర్షీద్ అలీ ఖాన్, అహ్మదాబాద్

"ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్​లో అఖిలేశ్ అంతో ఇంతో చేశారు. మాయావతి అందరికీ కన్నా ఉత్తమంగా పనిచేశారు."
-గృహిణి, కాన్పూర్

"పేదవాళ్లకు మోదీ ఏం చేయలేదు. రాహుల్ వస్తే పరిస్థితి మారుతుందేమో? రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. ప్రజలు ఎంత సంపాదిస్తున్నారు? ఇలా అయితే వాళ్లేం తింటారు?"
-ఆసియా భాను, అహ్మదాబాద్

"నాకు తెలిసి ఇదో ఎన్నికల హామీ. ఎన్నికల్లో కాకుండా వేరే సందర్భంలో ఇస్తే మరింత ప్రభావం ఉండేది. ఎన్నికల్లో కొత్త ట్రెండు ప్రారంభమైంది. డబ్బులను ప్రజల ఖాతాల్లో నేరుగా జమచేస్తూ ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి పార్టీలు. ఇది ఓ రకంగా సహాయం చేయవచ్చు. దేశంలో పేదలే ఎక్కవ శాతం ఉన్నారు. ఇందులో రాయితీ, సంక్షేమ పథకాలున్నాయి. దీనిని ప్రారంభిస్తే మిగిలిన సంక్షేమ పథకాలన్నింటినీ ఆపాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు.. ఇది పేదరికంపై చివరి పోరాటమని. నాకు తెలిసి వరుస పరాజయాలతో ఉన్న కాంగ్రెస్​ ఓట్ల కోసమే ఈ పోరాటం. ఏదేమైనా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. కానీ ఆచరణ చాలా కష్టం"
-శరద్ కోహ్లీ, ఆర్థికవేత్త

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details