తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాట ఉగ్ర కలకలం... సర్వత్రా హైఅలర్ట్

తమిళనాడులోకి లష్కరే తోయిబా ఉగ్రవాదులు ప్రవేశించారని నిఘా సమాచారం. వీరు కోయంబత్తూరు సహా పలు నగరాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన పోలీసులు రాష్ట్రంలో రెడ్అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

రెడ్​అలర్ట్: తమిళనాడులో చొరబడ్డ ఎల్​ఈటీ ముష్కరులు

By

Published : Aug 23, 2019, 11:54 AM IST

Updated : Sep 27, 2019, 11:32 PM IST

లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలో ప్రవేశించారనే నిఘా సమాచారంతో... తమిళనాడు వ్యాప్తంగా పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

రెడ్​అలర్ట్: తమిళనాడులో చొరబడ్డ ఎల్​ఈటీ ముష్కరులు

లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక నుంచి సముద్రమార్గం ద్వారా తమిళనాడులో ప్రవేశించారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ముష్కరులు తమిళనాడులోని కోయంబత్తూర్ సహా వివిధ నగరాలకు వెళ్లినట్లు చెప్పాయి. అయితే వీరు ఏ దేశానికి చెందినవారో స్పష్టంగా తెలియనప్పటికీ, ఒక ముష్కరుడు మాత్రం పాకిస్థాన్​కు చెందినవాడని సమాచారం.

రెడ్​అలర్ట్: తమిళనాడులో చొరబడ్డ ఎల్​ఈటీ ముష్కరులు

భద్రత కట్టుదిట్టం

ఉగ్రముప్పు నేపథ్యంలో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్​లు, ప్రార్థనా స్థలాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సముద్రతీర జిల్లాల్లో ఉగ్రదాడుల గురించి హెచ్చరికలు జారీచేశారు. ముఖ్యంగా కోయంబత్తూరులో పోలీసులు మోహరించి, తనిఖీలు చేపట్టారు.

ఇదీ చూడండి: భారత్​-పాక్​లు కోరితే మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్​

Last Updated : Sep 27, 2019, 11:32 PM IST

ABOUT THE AUTHOR

...view details