తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' సెగతో భారతీయ రైల్వేకు రూ.80కోట్లు నష్టం

పౌర చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు రైల్వే శాఖకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. దేశవ్యాప్తంగా రూ.80కోట్ల మేర ఆస్తి నష్టం జరగ్గా... ఆ మొత్తాన్ని నిరసనకారుల నుంచే వసూలు చేయాలని భావిస్తోంది భారతీయ రైల్వే.

railway property
'పౌర' సెగతో భారతీయ రైల్వేకు రూ.80కోట్లు నష్టం

By

Published : Dec 30, 2019, 4:33 PM IST

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన హింసాయుత నిరసనల కారణంగా భారతీయ రైల్వేకు రూ.80 కోట్ల మేర ఆస్తినష్టం జరిగింది. రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ ఈ విషయం వెల్లడించారు.

"సీఏఏ నిరసనల్లో రైల్వేకు రూ.80 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. నష్టానికి కారకులైన వారిని గుర్తించి వారి నుంచే పరిహారాన్ని వసూలు చేస్తాము."

-వినోద్​ కుమార్​ యాదవ్​, రైల్వే బోర్డు ఛైర్మన్​

సీఏఏ, ప్రతిపాదిత ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక నిరసనలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో తీవ్ర హింస చెలరేగింది.

ఇదీ చూడండి : విద్యుదాఘాతం... తల్లి, ఐదుగురు బిడ్డలు సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details