తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రంప్​ను తీసుకొచ్చినా డోంట్​ కేర్​: స్వామి - భాజపా

కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్​ ట్యాపింగ్​ కేసును సీబీఐకి అప్పగించబోతున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. దీనిపై స్పందించిన కుమారస్వామి ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. గత కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో హస్తం పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య, అతని అనుచరుల ఫోన్లను ట్యాప్​ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కుమారస్వామి.

సీబీఐ చేతికి... ఫోన్​ ట్యాపింగ్ కేసు

By

Published : Aug 19, 2019, 6:35 AM IST

Updated : Sep 27, 2019, 11:35 AM IST

కర్ణాటక రాజకీయాల్లో ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును... కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. దీనిపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ కేసు విషయంలో అంతర్జాతీయ ఏజెన్సీ దర్యాప్తునకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.

ఇంతకీ ఏమిటీ వివాదం...

గత కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ హయంలో... మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన అనుచరుల ఫోన్లను మిత్ర పక్షమైన జేడీఎస్​ ట్యాప్​ చేసిందని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జేడీఎస్​ రెబల్​ ఎమ్మెల్యే ఎ.హెచ్​. విశ్వనాథ్​... కుమారస్వామి ప్రభుత్వం, తనతో సహా 300 మంది రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్​ చేసిందని ఆరోపించారు. భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్​ షెట్టర్... కుమారస్వామిపై నేరుగా ఫోన్​ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. అయితే జేడీఎస్​ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.

ట్రంప్​తోనైనా దర్యాప్తు చేయించుకోండి

"ఫోన్​ ట్యాపింగ్ కేసుపై... సీబీఐ లేదా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఏ ఇతర ఏజెన్సీతోనైనా వారు దర్యాప్తు చేయనివ్వండి. లేదా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో అయినా మాట్లాడనివ్వండి. ఆయన వైపు నుంచి ఒకరి ద్వారా విచారించనివ్వండి."
- హెచ్​డీ కుమారస్వామి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్​ నేత

మీడియాపై చిందులు

ఫోన్ ట్యాపింగ్ కేసుపై కవరేజ్​కు వచ్చిన మీడియాపై కుమారస్వామి చిందులు తొక్కారు. 'నన్ను ఎవరూ ఏమీ చేయలేరు' అంటూ వ్యాఖ్యానించారు.

"ఎలక్టానిక్ మీడియా ప్రవర్తనను నేను గమనిస్తున్నాను. వారి ఉద్దేశం, ప్రయత్నాలు.. కుమారస్వామిని రాష్ట్ర రాజకీయాలు, ప్రజల నుంచి దూరం చేయడం. అయితే వారు ఇందులో విజయం సాధించలేరు."-కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత

కాంగ్రెస్​లో... భిన్నవాదనలు

ఫోన్​ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించడాన్ని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే, ఎమ్​బీ పాటిల్​ స్వాగతించారు. అయితే భాజపా.... సీబీఐ దర్యాప్తును 'రాజకీయ కక్ష సాధింపు' కోసం ఉపయోగించదని తాను ఆశిస్తున్నట్లు సిద్ధరామయ్య పేర్కొన్నారు.

కాంగ్రెస్ ముఖ్య నేత డీకే శివకుమార్​ మాత్రం ఫోన్​ ట్యాపింగ్ ఆరోపణలను ఖండించారు.

రౌడీలా ప్రవర్తిస్తున్నారు...

కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో.. టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అబద్ధమని పేర్కొంది. భాజపా విద్వేషపూరిత రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించింది.

"'ఆపరేషన్​ కమల' ద్వారా అనైతిక పద్ధతిలో ముఖ్యమంత్రి అయిన యడియూరప్ప... అండర్​గ్రౌండ్​ క్రిమినల్​గా వ్యవహరిస్తున్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో సీబీఐ... భాజపా అనుబంధ సంస్థలా పనిచేస్తోంది."- కాంగ్రెస్ పార్టీ ట్వీట్​

యడియూరప్పపై కాంగ్రెస్ ట్వీట్​

ఇదీ చూడండి: బ్రెగ్జిట్​కు ముందు ఈయూ దేశాల్లో బోరిస్ పర్యటన

Last Updated : Sep 27, 2019, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details