తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరుణ్​ జైట్లీ మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ మృతిపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అరుణ్​ జైట్లీ మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

By

Published : Aug 24, 2019, 2:45 PM IST

Updated : Sep 28, 2019, 2:53 AM IST

భారతీయ జనతా పార్టీ సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి కోవింద్​, ఉప రాష్ట్రపతి వెంకయ్య సహా పలువురు అగ్రనేతలు జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జైట్లీ గొప్పనేత..

రాష్ట్రపతి దిగ్భ్రాంతి

అరుణ్​ జైట్లీ మృతి తనను ఎంత కలచివేసిందన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైట్లీ.. గొప్ప న్యాయవాది, అనుభవజ్ఞుడైన పార్లమెంట్​ సభ్యుడు​, దేశ నిర్మాణంలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు కోవింద్.

తీరని లోటు..

అరుణ్​ జైట్లీ మృతి దేశానికి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జైట్లీని శక్తిమంతమైన మేధావి, సమర్ధుడైన పాలనాధికారిగా అభివర్ణించారు వెంకయ్య. తనకు దీర్ఘకాల మిత్రుడు, అత్యంత సన్నిహితుల్లో జైట్లీ ఒకరని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుడిని కోల్పోయా...

అమిత్​ షా ట్వీట్​

అరుణ్​ జైట్లీ మృతి ఎంతో బాధ కలిగించిందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా. ఆయన మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. సీనియర్​ పార్టీ నాయకుడినే కాక, తనకు ఎప్పుడూ మార్గదర్శకుడిగా ఉన్న కుటుంబ సభ్యుడిని కోల్పోయానన్నారు షా.

దేశానికే ఆస్తి జైట్లీ..

రాజ్​నాథ్​ ట్వీట్​

అరుణ్​ జైట్లీ మృతిని తీరని లోటుగా పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఆయనను దేశానికి, పార్టీకి గొప్ప ఆస్తిగా అభివర్ణించారు. జైట్లీ మృతి వార్త తెలియగానే లఖ్​నవూ నుంచి దిల్లీకి బయలుదేరి వెళ్లారు.

విపక్ష నేతలు...

సోనియా గాంధీ సంతాపం

జైట్లీ మృతి పట్ల విపక్ష నేతలు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతాబెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​, ​లోక్​సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:- ఆఖరి క్షణం వరకు కాషాయ సైనికుడిగానే సేవలు...

Last Updated : Sep 28, 2019, 2:53 AM IST

ABOUT THE AUTHOR

...view details