తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ర్యాపిడో'లో ఉచితంగా వెళ్లి ఓటేయండి! - ర్యాపిడో

ఉత్తరప్రదేశ్ లఖ్​నవూ ఓటర్లకు ఉచిత బైక్ సేవలు అందించనున్నట్లు బైక్​ ట్యాక్సి సంస్థ 'ర్యాపిడో' ప్రకటించింది. ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేల ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం​ తీసుకున్నట్లు తెలిపింది.

ర్యాపిడో

By

Published : May 6, 2019, 6:16 AM IST

'ర్యాపిడో'లో ఉచితంగా వెళ్లి ఓటేయండి!

ఉత్రరప్రదేశ్​ రాజధాని లఖ్​నవూ ఓటర్లకు బైక్ ట్యాక్సి సంస్థ 'ర్యాపిడో' వినూత్న ఆఫర్ ప్రకటించింది. నేడు జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేవారు తమ పోలింగ్​ కేంద్రాల​కు వెళ్లేందుకు ఉచితంగా బైక్ సేవలను అందిస్తున్నట్లు వెల్లడించింది.

ర్యాపిడో మొబైల్ యాప్​ ద్వారా బైక్ బుక్​ చేసుకునేటప్పుడు "ఐ ఓట్​" అనే కూపన్​తో ఈ ఆఫర్​ను వినియోగించుకోవాలని సూచించింది.

ప్రతీ ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకే ఈ ఆఫర్​ను తీసుకువచ్చినట్లు 'ర్యాపిడో ' సంస్థ తెలిపింది. లఖ్​నవూలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు వర్తిస్తుంది.

ఐదోదశ ఎన్నికల్లో భాగంగా లఖ్​నవూలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

ఇదీ చదవండి:ఈ నెల 23 నుంచి దేశంలో యూపీఏ సర్కార్: పైలట్

ABOUT THE AUTHOR

...view details