తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారీ రంగోలీ'తో వాయుసేనకు సలాం - మహారాష్ట్ర

మహారాష్ట్ర నూతన సంవత్సర వేడుకల్లో ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు నిర్వాహకులు. పాక్​ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దాడిని కీర్తిస్తూ 7 వేల అడుగుల విస్తీర్ణంలో రంగోలీ వేశారు.

'భారీ రంగోలీ'తో వైమానిక దాడికి ఘననివాళి

By

Published : Mar 31, 2019, 6:00 AM IST

Updated : Mar 31, 2019, 7:16 AM IST

మరాఠీల నూతన సంవత్సర వేడుక గుడిపాడ్వా. ఈ పండగ సందర్భంగా ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ముంబయిలోని స్వామి వివేకానంద యువ ప్రతిష్ఠ సామాజిక సంస్థ నిర్వాహకులు.

పాకిస్థాన్​ ఉగ్రశిబిరాలపైభారత వైమానిక దాడిని కీర్తిస్తూ 7వేల అడుగుల విస్తీర్ణంలో రంగోలీ చిత్రాన్ని వేశారు. 200 కిలోల ముగ్గు పిండి, 600 కిలోల రంగుల్ని ఈ చిత్రాన్ని వేసేందుకు ఉపయోగించారు. 25 మంది కళాకారులు 7 గంటల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఏటా మరాఠా నూతన సంవత్సర వేడుకల్లో వినూత్న చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు స్వామి వివేకానంద యువ ప్రతిష్ఠ సభ్యులు.

ఇదీ చూడండి:భారత్ భేరి : మోదీకి జై... యడ్డీకి నై...!

Last Updated : Mar 31, 2019, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details