దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఈ సందర్భంగా ఆయన ఓ సందేశాన్ని వినిపించారు. ప్రేమ, కరుణ, సహనాన్ని పంచుతూ సమసమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న వారందరినీ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి - రామ్‌నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఆయన ఓ సందేశాన్ని వినిపించారు. ప్రేమ, కరుణ, సహనాన్ని పంచుతూ సమసమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న వారందరినీ ప్రోత్సహించాలని సూచించారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
ప్రతి నూతన సంవత్సరం కొత్త అవకాశాలను కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ‘‘ కొవిడ్-19 వల్ల 2020 సంవత్సరం చాలా కష్టంగా గడిచింది. కరోనా మహమ్మారిని దూరం చేయడానికి మన మందరం కలిసి కట్టుగా ముందుకు సాగాలి. కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నా’’ అని రాష్ట్రపతి అన్నారు.
ఇదీ చదవండి :'దిల్లీ సరిహద్దుల్లోనే రైతుల నూతన సంవత్సర వేడుకలు'