దేశంలో సుదీర్ఘకాలం ప్రధాన మంత్రిగా కొనసాగిన రికార్డును నరేంద్రమోదీ బద్దలుకొడతారని జోస్యం చెప్పారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్. త్రిపుర రాజధాని అగర్తలాలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. భాజపాకు ఇప్పట్లో ఎదురులేదంటూ భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు రాం మాధవ్.
2047 వరకు భాజపాదే అధికారం: రాం మాధవ్
అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగి, గతంలో కాంగ్రెస్ నెలకొల్పిన రికార్డును నరేంద్ర మోదీ తిరగరాస్తారని వ్యాఖ్యానించారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100ఏళ్లు పూర్తయ్యేవరకు భాజపానే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు.
2047 వరకు భాజపాదే అధికారం: రాం మాధవ్
"ప్రస్తుత ప్రభుత్వం సుదీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగుతుంది. మీకు చరిత్ర గుర్తు చేస్తున్నా. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1950 నుంచి 1977 వరకు 27ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సుదీర్ఘ కాలం పదవి చేపట్టి కాంగ్రెస్ రికార్డు నెలకొల్పింది. మోదీ ఆ రికార్డునూ బద్దలు కొడతారు. భాజపా అధికారంలోనే వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలను 2047లో జరుపుకుంటాం."
-రాం మాధవ్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి.
ఇదీ చూడండి: గురువాయూర్ ఆలయంలో మోదీ పూజలు