కర్ణాటక రాజకీయ సంక్షోభంపై రాజ్యసభ దద్దరిల్లింది. మొదటగా దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. అనంతరం కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. ఈ అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున సభలో చర్చించలేమని స్పష్టంచేశారు. ఛైర్మన్ ప్రకటనతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. గందరగోళం కారణంగా సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత పరిస్థితిలో మార్పు రాలేదు. ఫలితంగా రాజ్యసభ మరో 2 సార్లు వాయిదా పడింది.