తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీపై అభ్యంతరకర పోస్టు.. వెంకయ్య నాయుడు ఫైర్​​ - pm modi latest news

ప్రధాని నరేంద్ర మోదీపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర, అవమానకర పోస్టులు చేసినందుకు రాజ్యసభ భద్రతా అధికారికి హోదా తగ్గించారు వెంకయ్య నాయుడు. రాజకీయ తటస్థ వైఖరి చూపనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యసభ సెక్రటేరియట్ అధికారిక ప్రకటనలో తెలిపింది.

rajya-sabha-security-officer-demoted-for-offensive-posts-against-pm
మోదీపై పోస్టులు..రాజ్యసభ భద్రతా అధికారి డిమోట్​

By

Published : Feb 13, 2020, 9:54 PM IST

Updated : Mar 1, 2020, 6:22 AM IST

రాజ్యసభ భద్రతా అధికారి ఒకరికి హోదా తగ్గించారు చైర్మన్​ వెంకయ్య నాయుడు. సామాజిక మాధ్యమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అభ్యంతరకర, అవమానకర, వ్యంగ్య పోస్టులు చేసినందుకు శిక్షగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సెక్రటేరియట్​ అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

రాజకీయ తటస్థ వైఖరి కనబర్చకుండా అధికారి ఉరుజుల్​ హసన్​ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిరించారని రాజ్యసభ సెక్రటేరియట్​ తెలిపింది. మోదీ సహా, పలువురు కేంద్ర మంత్రులు, భాజపా సీఎంలపై అభ్యంతరకర పోస్టులు చేసినందుకే క్రమశిక్షణారాహిత్యం కింద ఈ చర్యను తీసుకున్నట్లు పేర్కొంది. రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలనూ హసన్ షేర్​ చేసినట్లు వెల్లడించింది.

ఈ చర్యతో ప్రస్తుతం రాజ్యసభ భద్రతా డిప్యూటీ డైరెక్టర్​ ఉన్న హసన్​ వేతనంలో మరో ఐదేళ్ల పాటు ఎలాంటి పెంపు ఉండబోదు. పదవీ హోదా తగ్గుతుంది. శిక్షాకాలం పూర్తయ్యే వరకు పదోన్నతి లభించదని రాజ్యసభ సెక్రటేరియట్​ ప్రకటన స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'ఎయిరిండియా​ హీరో'లకు ప్రధాని అభినందనలు

Last Updated : Mar 1, 2020, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details