జాతీయ వైద్య కమిషన్ బిల్లు(ఎన్ఎంసీ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం చట్టరూపం దాల్చనుంది.
సవరణలు కోరిన విపక్షాలు

ఎన్ఎంసీ బిల్లులో సవరణలు చేయాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు డిమాండ్ చేశాయి. బిల్లులో మూడున్నర లక్షల మంది అర్హతలేని వ్యక్తులను ఆధునిక వైద్య అభ్యాసానికి అనుమతించేలా ఉన్న నిబంధనను తొలగించాలన్నాయి.
సభలో విపక్షాల ఆందోళన నడుమే బిల్లుకు ఆమోదం లభించింది.