వరుసగా రెండో సారి ప్రధాని పదవిని అలంకరించనున్నారు నరేంద్ర మోదీ. ఈ నెల 30న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు నేతలు, ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. రాజకీయాల్లోకి మళ్లిన సినీ దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్ కూడా ఈ జాబితాలో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే వారి హాజరుపై స్పష్టత లేదని సమాచారం.
మోదీ ప్రమాణ స్వీకారానికి రజినీ, కమల్‌కు ఆహ్వానం - కమల్ హాసన్
ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ రంగాల ప్రముఖులను అహ్వానిస్తున్నారు. సినిమా నుంచి రాజకీయాల్లోకి మళ్లిన తమిళ దిగ్గజ నటులు రజినీకాంత్, కమల్ హాసన్‌లను ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కమల్, రజినీకు ఆహ్వానం
ఇద్దరు నటుల్లో కమల్ మాత్రమే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అనూహ్యంగా ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. ఎన్నికల్లో భాజపాను తీవ్రంగా వ్యతిరేకించారు కమల్. స్వతంత్ర భారతంలో మొదటి తీవ్రవాది హిందువేనని కమల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.
ఇదీ చూడండి: మోదీ ప్రమాణ స్వీకారానికి బిమ్స్టెక్ దేశాధినేతలు!
Last Updated : May 28, 2019, 7:31 AM IST