తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నాయకుడి కోసం కాంగ్రెస్​ వెతుకుతూనే ఉంది' - ప్రతిపక్షం

కాంగ్రెస్​లో నాయకత్వ సంక్షోభంపై రక్షణ శాఖ మంత్రి, భాజపా నేత రాజ్​నాథ్​ సింగ్​ స్పందించారు. ప్రతిపక్ష పార్టీ ఇప్పటికీ నాయకుడి కోసం వెతుకుతూనే ఉందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​కు అధ్యక్షుడు ఉండబోతున్నారా లేదా అనేది స్పష్టత లేదన్నారు.

'నాయకుడి కోసం కాంగ్రెస్​ వెతుకుతూనే ఉంది'

By

Published : Jul 7, 2019, 7:56 AM IST

కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ప్రతిపక్ష పార్టీ నేటికీ అధ్యక్షుడి కోసం వెతుకుతూనే ఉందంటూ ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్​కు నాయకుడు ఉంటాడా లేదా అనేది స్పష్టత లేదని విమర్శించారు.

రాజస్థాన్​లోని జైపుర్​లో భాజపా జాతీయ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు రాజ్​నాథ్​. లోక్​సభ ఎన్నికల్లో భారీ విజయంతో భాజపా-ఎన్డీఏ వైఖరిపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు.

"నాయకత్వంపై ఆందోళన చెందిన భాజపా వెంటనే జేపీ నడ్డాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించుకుంది. అనంతరం సంస్థాగత కార్యకలాపాలను ప్రారంభించింది. కానీ కాంగ్రెస్​లో ఎవరు అధ్యక్షుడు అనేది తెలియకుండా ఉంది. అసలు కాంగ్రెస్​కు నాయకుడు ఉంటాడా లేదా అనేది స్పష్టంగా తెలియదు. పార్టీ ఇప్పటికీ ఎవరు అధ్యక్షుడు అయితే బాగుంటుందని వెతుకుతూనే ఉంది. కాంగ్రెస్​లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులున్నాయి. "

- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ శాఖ మంత్రి.

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్​ గాంధీ రాజీనామా చేశారు.

ABOUT THE AUTHOR

...view details