తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నేడో రేపో..తేలుతుంది'

బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దాడిలో మృతి చెందిన ముష్కరుల సంఖ్య త్వరలో బయటపడతుందని కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

వైమానిక దాడి మృతుల సంఖ్యపై ​నాథ్​సింగ్

By

Published : Mar 6, 2019, 12:28 AM IST

నేడో రేపో బాలాకోట్ వైమానిక దాడి ఉగ్రవాదుల సంఖ్య బయటపడుతుందన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్. 300 ఫోన్లు బాలాకోట్ దాడులకు ముందు ఆ ప్రాంతంలో పనిచేశాయన్న జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్​టీఆర్​ఓ) విశ్లేషణను ఉటంకించారు రాజ్​నాథ్.

అసోంలోని దుబ్రీలో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ ప్రాజెక్టును రాజ్​నాథ్ సింగ్​ ప్రారంభించారు. ప్రతిపక్షాలు వైమానిక దాడులపై రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్​ నేతలు పాకిస్థాన్​కు వెళ్లి ఉగ్రవాదుల మృతదేహాల్ని లెక్కించుకోవచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"వైమానిక దాడుల్లో ఎంతమంది మృతి చెందారని కొన్ని పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎంతమంది మృతి చెందారో నేడో, రేపో బయటపడుతుంది. పాకిస్థాన్ నేతలకు తెలుసు ఎంతమంది మృతి చెందారన్న విషయం"-రాజ్​నాథ్​సింగ్, కేంద్ర హోంమంత్రి

ABOUT THE AUTHOR

...view details