కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియామకం - Rajiv Kumar appointed as the Election Commissioner following the resignation of Ashok Lavasa.
రాజీవ్ కుమార్
22:40 August 21
నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర న్యాయ శాఖ
ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ పదవికి అశోక్ లావాస రాజీనామా చేశారు. అశోక్ లావాస స్థానంలో రాజీవ్ కుమార్‌ని నియమిస్తూ ఈ మేరకు న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈనెల 31న బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు అశోక్ లావాస. అనంతరం రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
రాజీవ్‌కుమార్ 1984 బ్యాచ్ ఝార్ఖండ్ క్యాడర్‌కు చెందిన ఐఏఐస్ అధికారి.
Last Updated : Aug 21, 2020, 11:33 PM IST