సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన సోదరుడు సత్యనారాయణ రావు అన్నారు. ఈ విషయంలో తుది నిర్ణయం రజనీదేనని స్పష్టంచేశారు.
"రజనీ.. పార్టీ పెడతారని మేము కూడా భావించాం. ఆరోగ్యరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పార్టీ స్థాపించాలా వద్దా అనేది ఆయన ఇష్టం. తను తీసుకున్న నిర్ణయం సరైనదే. ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నిర్ణయం మార్చుకోమని మనం బలవంతం చేయలేము."