ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతిపెద్దది. ఎంతోమంది దార్శనిక నాయకులు రాజ్యాంగ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించారు. అందులో ముఖ్యనేత భారత తొలి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్.
భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్‌లో బిహార్ నుంచి ఎంపికైన 36 మంది సభ్యుల్లో రాజేంద్ర ఒకరు. 1946 డిసెంబర్ 11న రాజ్యాంగ పరిషత్‌కు ఆయన శాశ్వత అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
రావాల్సిన పేరు రాలేదు...
డా. రాజేంద్ర ప్రసాద్ మనుమరాలు తారా సిన్హా ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాణంలో రాజేంద్ర ప్రసాద్ పాత్రపై ఎవరూ ఇప్పటివరకు చర్చించలేదన్నారు.
రాజేంద్ర ప్రసాద్ మార్గదర్శకాల ద్వారా భారత రాజ్యాంగం 3 ఏళ్ల లోపు విజయవంతంగా రూపుదిద్దుకుందని తెలిపారు తార. రాజ్యాంగ నిర్మాణంలో రాజేంద్రప్రసాద్ పాత్ర ఎనలేనిదన్నారు. అయితే సాధారణ జనంలో చారిత్రక రాజ్యాంగ నిర్మాణానికి పడ్డ శ్రమపై అంత అవగాహన లేదని అభిప్రాయపడ్డారు.
భారత రాజ్యాంగ నిర్మాతగా... కీర్తి గడించాల్సిన రాజేంద్ర ప్రసాద్... ఆ పుస్తకం గురించి చర్చించేటప్పుడు మాత్రమే గుర్తుకు రావడం బాధాకరమన్నారు ఆయన మనుమరాలు.
ఆయనే ప్రధాన వ్యక్తి...
రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు అందులో సమానత్వాన్ని ఇనుమడింపజేయడంలో ఎదురైన సవాళ్లు, వాటిని రాజేంద్ర అధిగమించిన తీరును రాజకీయ విశ్లేషకుడు, ఏఎన్ సిన్హా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ మాజీ డైరక్టర్ డీఎమ్ దివాకర్ ప్రస్తావించారు.