లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తున్న క్రమంలో ఇప్పుడిప్పుడే ఆర్థిక కార్యకలాపాలు, ప్రయాణాలు ప్రారంభమవుతున్నాయి. మరోవైపు కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి అంతర్రాష్ట్ర ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలు విధించింది రాజస్థాన్. రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
''రాష్ట్రంలోకి వచ్చే, బయటకి వెళ్లే వారిపై నియంత్రణ ఉంటుంది. సంబంధిత అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) లేకుండా రాజస్థాన్‌లోకి ఎవరూ ప్రవేశించలేరు. పాస్ లేకుండా రాష్ట్రం నుంచి బయటకి వెళ్లలేరు. సరిహద్దుల్లో తక్షణమే తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఐజీలు, ఎస్పీలు, కమిషనర్లు, ఉప కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఏడు రోజుల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.''