తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్టిక్​పై యుద్ధం: రైల్వేస్టేషన్లలో వాటర్​ బాటిల్​ క్రషర్లు - రైల్వే స్టేషన్లు

ప్లాస్టిక్​ వాటర్​ బాటిళ్లను నిర్మూలించేందుకు దేశవ్యాప్తంగా 407 స్టేషన్లలో క్రషర్లను ఏర్పాటు చేయనుంది భారత రైల్వే శాఖ. అక్టోబర్​ 2లోపు ఈ స్టేషన్లలో పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకురావాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టింది.

ప్లాస్టిక్​పై యుద్ధం.. రైల్వే స్టేషన్లలో వాటర్​ బాటిళ్ల క్రషర్లు

By

Published : Sep 12, 2019, 7:00 AM IST

Updated : Sep 30, 2019, 7:22 AM IST

ప్లాస్టిక్​పై యుద్ధానికి రైల్వే శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. మెట్రో, పెద్ద నగరాల్లోని 407 స్టేషన్లలో వాటర్​ బాటిల్​ క్రషర్లు (బాటిళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసే యంత్రాలు)ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2019 అక్టోబర్​ 2లోపు అన్ని ఏ1, ఏ కేటగిరీ స్టేషన్లలో పూర్తి స్థాయిలో క్రషర్లను అందుబాటులోకి తీసుకురావాలని చర్యలు చేపట్టింది.

స్వచ్ఛతా-హీ-సేవా...

సెప్టెంబర్​ 11 నుంచి అక్టోబర్​ 2 గాంధీ జయంతి వరకు 'స్వచ్ఛతా హీ సేవా(ఎస్​హెచ్​ఎస్)​' కార్యక్రమం చేపట్టనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం ఎస్​హెచ్​ఎస్​ తొలి రోజు సందర్భంగా పెద్దఎత్తున సిబ్బందితో ప్లాస్టిక్​ వ్యర్థాల సేకరణ కార్యక్రమం 'శ్రమదాన్​' చేపట్టింది.

ప్రచారం...

'ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్​ నిషేధం' పై విస్తృత ప్రచారం సహా ప్లాస్టిక్​ వ్యర్థాల నిర్వహణపై రైల్వేశాఖ చర్యలు చేపట్టనుంది. ముఖ్యమైన ప్రాంతాల్లో బ్యానర్లు, పోస్టర్లు వంటివి ఏర్పాటు చేయనుంది. అన్ని ఏ1, ఏ కేటగిరి రైల్వే స్టేషన్లలో ఎస్​హెచ్​ఎస్​ లోగోతో ఉన్న ప్రత్యేక వ్యర్థాల సేకరణ డబ్బాలను పెంచనున్నారు. దేశవ్యాప్తంగా రైల్వేశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న 150 నర్సరీల అభివృద్ధికి సంబంధించిన పనులు అక్టోబర్​ 2 నాటికి పూర్తికానున్నాయి.

Last Updated : Sep 30, 2019, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details