ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి నడుం బిగించింది భారతీయ రైల్వే సంస్థ. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని అక్టోబర్ 2 నుంచి నిలిపివేయనుంది. అలాగే వీలైనంతగా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ బంద్ : భారతీయ రైల్వే - PLASTIC
50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిలిపివేయాలని భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2 నుంచి ఈ నిషేధం అమలులోకి రానుంది.
అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ బంద్ : భారతీయ రైల్వే
భారతీయ రైల్వేల్లో పనిచేసే సిబ్బంది సహా వ్యాపారులు పునర్వినియోగానికి పనికి వచ్చే ప్లాస్టిక్‌నే ఉపయోగించాలని కోరింది. ప్లాస్టిక్ బాటిళ్లను తిరిగి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని.. వాటి క్రషింగ్ యంత్రాలను కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని తెలిపింది.
Last Updated : Sep 27, 2019, 8:27 PM IST