దేశవ్యాప్తంగా దాదాపు 35 వేల మంది స్టేషన్ మాస్టర్లు శనివారం(అక్టోబర్ 31) రాత్రి ఖాళీ కడుపులతో విధులు నిర్వహించనున్నట్లు స్టేషన్ మాస్టర్స్ యూనియన్ గురువారం తెలిపింది. ఇప్పటిదాకా వీరికి ఇస్తున్న రాత్రి విధుల భత్యంపై సీలింగు విధిస్తున్నట్టు వెలువడిన ప్రకటనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలిండియా స్టేషన్మస్టర్ల యూనియన్( ఏఐఎస్ఎంయూ) వెల్లడించింది.
31న ఖాళీ కడుపులతో రైల్వే స్టేషన్ మాస్టర్ల విధులు - work on empty stomach
దేశవ్యాప్తంగా దాదాపు 35 వేల మంది స్టేషన్ మాస్టర్లు అక్టోబర్ 31న వినూత్న నిరసన తెలపనున్నారు. ఆ రోజు రాత్రివేళ.. ఖాళీ కడుపుతో విధులు నిర్వహించనున్నారు. రాత్రి విధుల భత్యంపై సీలింగు విధిస్తున్నట్టు వెలువడిన ప్రకటనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
31న ఖాళీ కడుపులతో రైల్వే స్టేషన్ మాస్టర్ల విధులు
అక్టోబరు 1 నుంచి ఈ ఆందోళన కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మూలవేతనం రూ. 48,600 దాటిన అధికారులకు రాత్రి విధుల భత్యం చెల్లించబోమన్న ఉత్తుర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు.
ఇదీ చూడండి:రైల్వే టాయిలెట్ల రంగుపై ఆ పార్టీ గరం!