కశ్మీర్లో పరిస్థితి హింసాత్మకంగా మారిందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. రాహుల్ చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు ఆయుధంగా మారాయన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
"రాహుల్ గాంధీ ఒక ప్రకటన చేశారు... కశ్మీర్లో పరిస్థితులు సాధారణంగా లేవని. ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది... రాహుల్ గాంధీ మీరు చెప్తున్నది చాలా తప్పు. కశ్మీర్లో ప్రతికూల వాతావరణం లేదు... హింస చెలరేగడం లేదు. కానీ రాహుల్ వ్యాఖ్యలు పాక్‌లో విశేష ప్రాచుర్యం పొందాయి. రాహుల్ వ్యాఖ్యల ఆధారంగానే కశ్మీర్లో హింసాత్మక వాతావరణం నెలకొందని పాకిస్థాన్ ఐరాసలో ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ ప్రకటన దేశం సిగ్గుపడేలా చేసింది. కశ్మీర్‌లోని వాస్తవిక పరిస్థితులపై ఆయన వ్యాఖ్యానించలేదు. పాక్ చేతుల్లో ఆయుధంగా మారారు."
-ప్రకాశ్ జావడేకర్, కేంద్రమంత్రి