'రాహుల్ రెట్టింపు బలంతో పుంజుకుంటారు' కాంగ్రెస్ అధినాయకత్వంపై అనిశ్చితి నెలకొన్న వేళ ఆ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీ తిరిగి రెట్టింపు బలంతో పుంజుకుంటారని ఉద్ఘాటించారు.
హరియాణా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటమికి సోనియా బాధ్యత వహిస్తారా? అన్న ప్రశ్నకు స్పందించారు ఆంటోనీ. పార్టీకి అవసరమైనంత వరకు అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.
"సోనియా జీ మా సుప్రీం నేత. ఆమె కాంగ్రెస్ వ్యక్తి. పార్టీ కోరుకునేంతవరకు కాంగ్రెస్ బాధ్యులుగా సోనియానే వ్యవహరిస్తారు. ఎందుకంటే పార్టీ సభ్యులంతా ఏకగ్రీవంగా కోరటం వల్లనే ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ విషయంలోనూ అంతే. రెట్టింపు బలంతో మళ్లీ పార్టీ కోసం పనిచేస్తారు."
-ఏకే ఆంటోనీ, కాంగ్రెస్ నేత.
ఇదీ చూడండి: పీఓకేలో ఉగ్రవాదుల ప్రభుత్వమే నడుస్తోంది: రావత్