తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏకగవాక్ష విధానంలో విద్యారుణాలు: రాహుల్​ - హామీలు

విద్యారంగానికి నిధుల కేటాయింపును గణనీయంగా పెంచుతామని ప్రకటించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. జీడీపీలో ఆరు శాతం కేటాయిస్తామని చెప్పారు. దేశంలోని విద్యార్థులందరికీ 1 నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యనందిస్తామని ఫేస్​బుక్​లో హామీ ఇచ్చారు.

రాహుల్​ గాంధీ

By

Published : Apr 8, 2019, 6:12 AM IST

Updated : Apr 8, 2019, 6:45 AM IST

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏకగవాక్ష(సింగిల్​ విండో) విధానంలో విద్యార్థులకు విద్యారుణాలు మంజూరు చేస్తామని కాంగ్రెస్​ జాతీయాధ్యక్షుడు రాహుల్​ గాంధీ హామీనిచ్చారు. విద్యార్థుల హక్కులు, విధులతో కూడిన ఓ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఈ మేరకు ఫేస్​బుక్​లో హామీలను పోస్ట్​ చేశారు.

"దేశంలోని విద్యార్థులందరికీ ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తాం. కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్వతంత్రతను పునరుద్ధరిస్తాం. రాష్ట్రాలు నిర్వహించే నూతన విశ్వవిద్యాలయాలను వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం. విద్యారంగాన్ని విశేషంగా అభివృద్ధి చేస్తాం. విద్యార్థుల హక్కు చట్టాన్ని తీసుకొస్తాం. దీంట్లో విద్యార్థుల హక్కులు, విధులు ఉంటాయి. విద్య చిన్నారుల అభివృద్ధి, సాధికారతకు తోడ్పడుతుంది. అలాంటి విద్య చిన్నారులందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం."-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

జీడీపీలో ఆరు శాతం

విద్యారంగానికి అధిక నిధులను కేటాయిస్తామని చెప్పారు రాహుల్​ గాంధీ.

" అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యనందిస్తాం. విద్యారంగానికి నిధుల కేటాయింపు పెంచుతాం. జీడీపీలో ఆరు శాతం కేటాయిస్తాం. ఈ ఏడాది మార్చి 31 ముందు తీసుకున్న విద్యా రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తాం. " -- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

సంపాదన మొదలయ్యాకే వడ్డీ

విద్యా రుణాల మంజూరుపైనా హామీలు ఇచ్చారు రాహుల్​.

" విద్యా రుణాలు మంజూరు చేసేందుకు ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెడతాం. విద్యార్థి ఉద్యోగమో లేక స్వయం ఉపాధో పొంది సంపాదన మొదలుపెట్టే వరకు బ్యాంకులు రుణాలపై వడ్డీ వసూలు చేయవు" -- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

Last Updated : Apr 8, 2019, 6:45 AM IST

ABOUT THE AUTHOR

...view details