తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"డబ్బులిచ్చే పథకాలతో దేశానికే ముప్పు" - నీతి ఆయోగ్​

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పథకంపై స్పందించారు నీతి ఆయోగ్​ వైస్​- ఛైర్మన్ రాజీవ్​ కుమార్​. ఇలాంటి పథకాల వల్ల దేశంలో ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుందని వ్యాఖ్యానించారు.

నీతి ఆయోగ్​ వైస్

By

Published : Mar 26, 2019, 7:04 AM IST

Updated : Mar 26, 2019, 7:17 AM IST

డబ్బులిచ్చే పథకాలతో దేశానికే ముప్పు

అధికారంలోకి వస్తే 5 కోట్ల కుటుంబాలకు సంవత్సరానికి 72 వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు నీతి ఆయోగ్​ వైస్​ - ఛైర్మన్​ రాజీవ్​ కుమార్​. దీని వల్ల ఆర్థిక క్రమశిక్షణ దారి తప్పే ప్రమాదముందని హెచ్చరించారు.

ఓ మీడియా సమావేశంలో రాహుల్​ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే పేదల్లో 20 శాతం మందిని ఎంపిక చేసి వారికి ఏటా 72 వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించారు.

"ఎన్నికల్లో గెలవటానికి రాహుల్​ గాంధీ సాధ్యం కాని హామీలు ప్రకటిస్తున్నారు. ఇలాంటి పథకాల వల్ల ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతుంది. దీనికి బదులు ఉద్యోగ కల్పన చేస్తే బాగుంటుంది "- రాజీవ్​ కుమార్​, నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​

వాటిలో ఒకటిగా ఈ పథకమూ నిలుస్తుంది...

కనీస ఆదాయ హామీ పథకం అమలుకయ్యే ఖర్చు కోసం దేశ జీడీపీలో 2 శాతం, బడ్జెట్​లో 13 శాతం సొమ్మును కేటాయించాలి. దీని వల్ల ప్రజల అవసరాలు తీరవు- రాజీవ్​ కుమార్​, నీతి ఆయోగ్​ వైస్ ఛైర్మన్​

కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించటానికి 1971లో 'గరీబీ హఠావో', 2008లో 'ఒకే ర్యాంకు- ఒకే పింఛను'​, 2013లో 'ఆహార భద్రత' లాంటి పథకాలను ప్రవేశ పెట్టింది. అయితే ఇవి పూర్తిగా అమలు కాక మధ్యలోనే ఆగిపోయాయని, కనీస ఆదాయ పథకం పరిస్థితి ఇదేనని రాజీవ్​ విమర్శించారు.

ట్వీట్... డిలీట్​...

ప్రధాన మంత్రి ఆర్థిక సలహా సంఘం రాహుల్​ గాంధీ ప్రకటనను విమర్శిస్తూ ట్వీట్​ చేసింది.

ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం సమతుల్యం చేయడానికి విశేష కృషి చేశాం. కాంగ్రెస్​ కనీస ఆదాయ పథకం ఈ సమతుల్యాన్ని చెడగొట్టడం లేదా ప్రభుత్వ ఖర్చులను అధికం చేస్తుందని ఈ రెండూ ప్రమాదకరమని వ్యాఖ్యానించింది.

కనీస ఆదాయ పథకం ఆర్థికంగా విఫలమైన పథకాల్లో ఒకటిగా నిలుస్తుందని సలహా సంఘం ఆరోపించింది. ట్విట్టర్​ వినియోగదారుడు ఒకరు సలహా సంఘం ట్వీట్​లు ఎన్నికలు నియమావళినిఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే సలహా సంఘం ఈ ట్వీట్లు తొలగించింది.

Last Updated : Mar 26, 2019, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details